మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే

మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే
X

పుట్టిన రోజే ఆ బాలుడికి మరణ దినంగా మారింది. మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి వేడి సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.... గురుకుల విద్యాలయం వసతిగృహం వంట మనిషిగా పని చేస్తున్న మొగిలి మధుకర్ ఆదివారం వంట చేసి సాంబారు గిన్నె పక్కనే పెట్టగా మధుకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడి సాంబార్ గిన్నెలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మధుకర్ బాలుడు మోక్షిత్‌ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మోక్షిత్ మృతి చెందాడు. ఆదివారం నాడే మోక్షిత్ పుట్టిన రోజు కాగా అదే రోజు మరణం సంభవించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు ధర్మారం ఎస్సై ఎం.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story