అనారోగ్యంతో ప్రియుడు మృతి... భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య

Boyfriend dies illness
మెదక్: ప్రియుడి మృతిని తట్టుకోలేక భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొండపాక ప్రాంతం కుకునూరుపల్లి మండలంలో జరిగింది. కుకునూరుపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన శ్రావణి, దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ ప్రేమించుకున్నాడు. శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను ఒక బాబా వద్దకు తీసుకెళ్లినప్పుడు అక్కడి మహేష్ పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. మహేష్ ఇటీవల అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ప్రియుడు మరణించడంతో శ్రావణి మానసికంగా కుంగిపోయింది. ఇంట్లో వాళ్లతో సరిగా లేకపోవడంతో తల్లి కూతురును పలుమార్లు ప్రశ్నించింది. ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అతడు మృతి చెందాడని బాధతో తల్లికి చెప్పింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రావణి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రావణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
