కొత్వాల్ చెరువులో పడిన బాలురు మృతదేహాలను వెలికితీత

కొత్వాల్ చెరువులో పడిన బాలురు మృతదేహాలను వెలికితీత
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కేసితండా వద్ద కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బాలురు చెరువులో జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు నీట మునుగుతుండగా గట్టుపై ఉన్న మరో బాలుడు ఇచ్చిన సమాచారంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువులో నుంచి గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రిషి(6),బద్రినాథ్ (8)గా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story