టేకాఫ్ అవుతుండగా.. విమానంలో చెలరేగిన మంటలు..

టేకాఫ్ అవుతుండగా.. విమానంలో చెలరేగిన మంటలు..
X

బ్రెజిల్: గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. లాటమ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానంలో క్యాబిన్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపేశారు.

ఆ వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న అగ్నిపామక సిబ్బందిమ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరకీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లాటమ్ విమాన సంస్థ స్పందించింది . విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. లగేజీ ఎక్కించే లోడర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది.

Tags

Next Story