సంబంధాలతో మార్పు కోసం బ్రిటన్ ప్రధాని చైనా వైపు

సంబంధాలతో మార్పు కోసం బ్రిటన్ ప్రధాని చైనా వైపు
X

లండన్: అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ చైనాకు వెళుతున్నారు. బుధవారం నుంచి ఆయన బీజింగ్, షాంఘైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, ప్రధాని లి కియాంగ్ లను కలుసుకుని చర్చలు జరుపుతారు. బ్రిటన్ చైనీస్ టెక్నాలజీ, పెట్టుబడిని కోరుతూ, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ చైనాకు అందించేందుకు సిద్ధమైంది.

బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ తో పాటు, బ్రిటీష్ వాణిజ్య వ్యవహారాల శాఖమంత్రి పీటర్ కైల్ పలువురు కార్పొరేట్ చీఫ్ లు ఈ పర్యటనలో పాల్గొంటారు. బ్రిటీష్ ప్రధాని చైనా పర్యటన వల్ల దేశంలో చైనా వ్యతిరేకుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహించే అవకాశం, మిత్రపక్షం అన్నది కూడా చూడకుండా అధికంగా సుంకాలు విధించే ప్రమాదం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు వల్ల నెలకొన్న అస్తవ్యస్థ నేపథ్యంలో అటు చైనా, ఇటు బ్రిటన్ కూడా స్థిరమైన సంబంధాలకోసం చూస్తున్నాయి.

Tags

Next Story