విషాదం.. నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు నీటికుంటలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన ఎపిలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నేరేంద్ర, చరణ్‌లు గ్రామ శివారులోని మామిడి తోటలో ఉన్న నీటి కుంటలో పడి మునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు, మరికొందరు కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. అనంతరం వారంతా మామిడి చెట్లకు పరుగుల మందు కొడుతున్నారు. ఈ తరుణంలో అన్నద మ్ములిద్దరూ నీటి కుంట వద్దకు వెళ్లారు.
తమ్ముడు చరణ్ కాళ్లు కడుగుకుంటానని నీటి కుంటలో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. అన్నయ్య కాపాడు అని కేకలు వేయడంతో తన అన్న అయిన నరేంద్ర తమ్మడిని కాపాడేందుకు నీటికుంటలో దిగాడు. కాపాడ బోయే తరుణంలో అన్నకూడా నీటిలో మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక మరణించారు. ఎంతకి తిరిగి రాకపోవడంతో చుట్టు ప్రక్కల గాలించారు. నీటికుంట వైపు వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. దీంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
Home
-
Menu
