మంచిర్యాల జిల్లా బంద్‌కు బిఆర్ఎస్ పిలుపు..

మంచిర్యాల జిల్లా బంద్‌కు బిఆర్ఎస్ పిలుపు..
X

మంచిర్యాల జిల్లా బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు, బాల్క సుమన్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన నేరుగా మంచిర్యాలలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూ నియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్‌తోపాటు మరో ముగ్గురికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు వారిని భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

Tags

Next Story