పరిగి కౌంటింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

X
పరిగి: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఎక్కువ భాగం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే వికారాబాద్ జిల్లా పరిగిలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మున్సిపాలిటీలో బిఆర్ఎస్, కాంగ్రెస్ చెరి 8 వార్డుల్లో గెలుపొందాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నేతలను బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో బిఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ కేంద్రం ముందు బిఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
