గజ్వేల్‌ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయ దందుభి

BRS Party
X

గజ్వేల్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటంగ్ శుక్రవారం జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 83, బిఆర్ఎస్ 15, బిజెపి 2, ఇతరులు 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ ఫలితాల్లో గజ్వేల్‌లో గులాబీ జెండా ఎగిరింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బిజెపి 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు.

Tags

Next Story