సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఒకటి సిరిసిల్ల బిఆర్‌ఎస్ వశం కాగా మరొకటి వేములవాడలో హంగ్ వచ్చినా అది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమైంది. ముందుగా అందరూ ఊహించినట్లుగా సిరిసిల్లలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యుడు కెటిఆర్ తన పట్టునిలుపుకోగా, వేములవాడలో ప్రభుత్వ విప్,శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ తన పట్టు బిగించారు. సిరిసిల్ల మున్సిపల్‌లో 39 వార్డులకు గాను బిఆర్‌ఎస్ 27 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది.కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి 6 స్ధానాలు గెలుచుకోగా,బిజేపి మూడో స్థానంలో నిలిచి 5 స్ధానాలు గెలుచుకుంది. బిజేపికి రాజీనామ చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. సిరిసిల్లలో పోటీ చేసిన సిపిఎం,ఏఐఎఫ్‌బి, జనసేన తదితర పార్టీలు తమ ఖాతా తెరువలేకపోయాయి.
వేములవాడలో 28 స్థానాలుండగా కాంగ్రెస్ పూర్తి మెజార్టీకి కనీసంగా రెండు స్థానాలు తక్కువైనా 13 స్థానాల్లో విజయం సాధించింది. బిజేపి రెండో స్థానంలో నిలిచి 8 స్థానాల్లో , మూడో స్థానంలో నిలిచిన బిఆర్‌ఎస్ 5 స్థానాల్లో గెలువగా స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. మిగతా పార్టీలకు ప్రజలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్దందంగా తిరస్కరించారు. సిరిసిల్లలో గులాబీ నేత కెటిఆర్ ఒంటరి పోరు సాగించి తన పట్టు నిలుపుకోగా, వేములవాడలో ఆది శ్రీనివాస్ తన పట్టు బిగించి బిఆర్‌ఎస్ ఖాతా ఇప్పటి వరకున్న మున్సిపల్‌ను కాంగ్రెస్ స్వాధీనంలోకి తెచ్చారు. సిరిసిల్ల ప్రజలు కెటిఆర్ వెన్నంటి ఉన్నామని మరోసారి తేల్చి చెప్పగా, వేములవాడలో ఆది శ్రీనివాస్ అభివృధ్ది చేస్తారనే విశ్వాసాన్ని ప్రజలు కనపర్చారని మున్సిపల్ ఫలితాలు నిరూపించాయి.
సిరిసిల్ల మున్సిపల్‌లో విజేతలు వీరే .....
సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా 1వ వార్డులో బూర బాలమల్లు (బిఆర్‌ఎస్), 2వ వార్డులో వేముల రాములు (బిఆర్‌ఎస్), 3వ వార్డులో జిందం కళ (బిఆర్‌ఎస్), 4వ వార్డులో లాయక్ సుల్తానా( కాంగ్రెస్), 5వ వార్డులో దార్నం అరుణ (బిఆర్‌ఎస్), 6వ వార్డులో దూడం రజని (బిఆర్‌ఎస్), 7వ వార్డులో ఎర్రం వెంకట్రాజం( బిజేపి), 8వ వార్డులో లింగంపెల్లి భాగ్యలక్ష్మి(బిఆర్‌ఎస్), 9వ వార్డులో దొంతినేని కళ్యాణి (బిఆర్‌ఎస్), 10వ వార్డులో బొల్గం వైష్ణవి (స్వతంత్ర) గెలుపొందారు.11వ వార్డులో మామిడాల మహేష్ (బిజేపి), 12వ వార్డులో మొగిలి రాజు (బిఆర్‌ఎస్), 13వవార్డులో బుర్ర నారాయణ గౌడ్ (బిఆర్‌ఎస్), 14వవార్డులో వెంగళ లీల( కాంగ్రెస్), 15 వవార్డులో కూర భాగ్యలక్ష్మి(బిఆర్‌ఎస్),16 వవార్డులో గుడ్ల శ్రీనివాస్(బిఆర్‌ఎస్), 17వవార్డులో గుండ్లపెల్లి నీరజ(బిఆర్‌ఎస్), 18వ వార్డులోమేరుగు మంజుల (బిజేపి), 19వ వార్డులో బొద్దుల శ్రీనివాస్ (కాంగ్రెస్), 20వ వార్డులో సాగాల హరిప్రసాద్ (బిఆర్‌ఎస్) విజయం సాధించారు.21వ వార్డులో ఎలుక వెంకటేశం (బిఆర్‌ఎస్),
22వ వార్డులో లింగంపల్లి గంగరాజు (కాంగ్రెస్ ),23వ వార్డులో ఆడెపు చంద్రకళ (కాంగ్రెస్), 24వ వార్డులో బుర్ర మల్లికార్జున్ (బిఆర్‌ఎస్), 25 వవార్డులో బింగి రామాంజనేయులు (బిఆర్‌ఎస్),26వ వార్డులో నెల్లుట్ల నరేష్ (బిఆర్‌ఎస్), 27వ వార్డులో కాసర్ల పద్మ(బిఆర్‌ఎస్),28వవార్డులో అడిచెర్ల రూప (బిఆర్‌ఎస్), 29వ వార్డులో గెంట్యాల శ్యామల (బిఆర్‌ఎస్), 30వ వార్డులో మంచె రేణుక (బిఆర్‌ఎస్ ) గెలుపొందారు. 31వ వార్డులో పాసికంటి రమ్య(బిఆర్‌ఎస్), 32వ వార్డులో కూరపాటి శ్రీశైలం(కాంగ్రెస్), 33వ వార్డులో కొండ వర్షిణి(బిజేపి), 34 వ వార్డులో దార్ల సందీప్ (బిఆర్‌ఎస్), 35వ వార్డులో బత్తుల రమేష్ (బిఆర్‌ఎస్), 36వ వార్డులో కల్లూరి రేణుక (బిఆర్‌ఎస్), 37వవార్డులో ఊరగొండ లక్ష్మి(బిజేపి), 38వవార్డులో రిక్కుమల్లే రజిత (బిఆర్‌ఎస్), 39వ వార్డులో ఆకుల స్వప్న (బిఆర్‌ఎస్) విజయం సాధించారు.
-
Home
-
Menu
