తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ పాగ

BRS
X

తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ మరోసారి పట్టు సాధించింది. మొత్తం 16 వార్డులుగా ఉన్న తొర్రూరు మున్సిపాలిటీలో 9 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించి వరసగా రెండో సారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొంది రెండవ స్థానానికి పరిమితమైంది. తొర్రూరు మున్సిపాలిటీగా అవిర్భావం చెందిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన పట్టు నిలుపుకుంది. మొదటి వార్డు నుండి బీఆర్‌ఎస్‌కు చెందిన భూసాని జయమ్మ 610 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి తాళ్లపెల్లి శ్రీలతకు 444 ఓట్లు రావడంతో జయమ్మ 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి తూనం శ్రవన్‌కుమార్‌కు 669 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి బీఆర్‌ఎస్‌కు చెందిన సర్వి వెంకన్నకు 447 ఓట్లు రాగా శ్రవన్‌కుమార్ 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డు నుండి బీఆర్‌ఎస్‌కు చెందిన తూర్పాటి రవికి 497 రాగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌కు చెందిన తూర్పాటి రాంబాబుకు 308 ఓట్లు రాగా రవి 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి పేర్ల జంపన్నకు 605 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి జలకం శ్రీనివాస్‌కు 440 ఓట్లు పోల్ కాగా జంపన్న 165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది చాపల బాపురెడ్డికి 668 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి మచ్చ సురేష్‌కు 495 ఓట్లు పోల్ కావడంతో బాపురెడ్డి 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి పెదగాని కళావతికి 675 ఓట్లు పోల్ కాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి రాయిశెట్టి మానసకు 514 ఓట్లు రావడంతో కళావతి 161 మెజార్టీతో విజయం సాధించారు.

7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి భవాని లతకు 598 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి జిలుకర సురేందర్‌కు 330 ఓట్లు రావడంతో భవానిలత 268 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 8వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి అల్లం శ్యామలకు 695 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి కేతిరెడ్డి సుమలతకు 399 ఓట్లు రాగా శ్యామల 296 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 9వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి బీఆర్‌ఎస్ కిన్నెర కవితకు 451 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి పంజా కల్పనకు 438 ఓట్లు సాధించగా కవిత 13 ఓట్ల మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి ముద్దసాని సురేష్‌కు 714 ఓట్లు రాగా ప్రత్యర్ధి బీఆర్‌ఎస్ అభ్యర్ధి రుద్రోజు విజయభాస్కర్‌కు 204 ఓట్లు రావడంతో సురేష్ 510 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి కర్నె నాగరాజుకు 473 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్ది పొనుగోటి సోమేశ్వర్‌రావుకు 440 ఓట్లు రావడంతో నాగరాజు 33ఓట్ల తేడాతో గెలిచారు. 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి ధరావత్ పద్మకు 562 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి కేతావత్ శ్రేయకు 391 ఓట్లు రావడంతో పద్మ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి బసనబోయిన ఐలమ్మకు 615 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎన్నమనేని శ్రీదేవికి 420 ఓట్లు రావడంతో ఐలమ్మ 195 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి సోమ రజనీకి 666 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ది మడిపెద్ది శ్రవంతికి 425 ఓట్లు రావడంతో రజనీ 241 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుంది. 15వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి చకిలేల అలివేణికి 383 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి బొమ్మనబోయిన సుజాతకు 357 ఓట్లు రావడంతో అలివేణి 26 ఓట్ల తేడాతో గెలుపొందింది. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి జాటోతు బద్రుకు 443 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి ధరావత్ వెంకన్నకు 339 ఓట్లు పోల్ కావడంతో బద్రు 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజేతలైన అభ్యర్థులకు అధికారులు దృవీకరణ పత్రాలను అందజేశారు.


క్యాంపులకు తరలిన విజేతలు...

ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ప్రత్యేక క్యాంప్‌లకు తరలి వెళ్లారు. బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు రావడంతో ఎక్కడ కూడా చైర్మన్ గిరి చేజారకుండా బీఆర్‌ఎస్ విజేతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక క్యాంప్‌లకు తరలించారు. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు తక్కువ ఉన్నప్పటికి ఏదైనా అవకాశం చిక్కితే ప్రత్యర్ధి పార్టీల నుండి విజేతలను తమవైపు తిప్పుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలకు పదును పెట్టింది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సూచనలతో విజేతలైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా క్యాంప్‌కు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బీఆర్‌ఎస్ విజేతలైన అభ్యర్థులను మాజీ మంత్రి దయాకర్‌రావు తన వెంట ప్రత్యేక బస్సులో ఆర్యభట్ట స్కూల్‌లోని కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చి అధికారుల చేతుల మీదుగా దృవీకరణ పత్రాలను తీసుకుని వెంటనే అదే బస్సులో తరలి వెళ్లారు. కాంగ్రెస్ విజేతలు కూడా ఇదే విధంగా ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లారు. ఈ విషయం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్తేజాన్ని నింపింది. నాంచారిమడూర్ నుండి ఆర్యభట్ట పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రం వరకు బీఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి దయాకర్‌రావుకు స్వాగతం పలికారు. ఇరు పార్టీల విజేతలైన అభ్యర్థుల అనుచరులు వారి వార్డుల్లో బానాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు.

Tags

Next Story