పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ గెలుపు

X
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో రసవత్తర పోరుగా కొనసాగుతోంది. ఎంఎల్‌ఎ, ఎంపి, కార్పొరేషన్ సొంతూర్లలో విరుద్ధమైన ఫలితాలు వస్తుండడంతో షాక్‌కు గురవుతున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. సూర్యాపేట మండలం బాలెంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిఆర్‌ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిజెపి అభ్యర్థి 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజాప్రతినిధులు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో ఒక్కసారిగా వారు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story
-
Home
-
Menu
