శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం
X

శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ను గుర్తించారు. ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విమానంలో అబుదాబి వెళ్తున్న ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేస్తుండగా బుల్లెట్ బయటపడింది. వెంటనే అప్రమత్తమైన సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. బుల్లెట్ ఎలా వచ్చింది? లైసెన్స్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story