అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

Jasprit Bumrah
X

టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులకు పెట్టింది పేరు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బుమ్రా తిరశరరాశాడు... సృష్టించాడు కూడా. కాగా, బుమ్రా నేటి మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే.. టి-20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈరోజు మ్యాచ్‌లో బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. అంతేకాక.. బుమ్రా ఇంకొక వికెట్ తీస్తే.. భారత్ తరఫున టి-20ల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ (105) ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Tags

Next Story