రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కి గుండెపోటు.. ఏం చేశాడంటే..

యాదాద్రి: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే గుండెపోటు బారిన పడి తుది శ్వాస విడుస్తున్నారు. ముఖ్యంగా మధ్య వయస్సు గల వారిని ఈ గుండెపోటు సమస్య కబలిస్తోంది. సోమవారం ఎపిఎస్‌ఆర్టిసి బస్సు ప్రయాణంలో ఉండగా డ్రైవర్‌కి గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణిస్తున్న అమరావతి బస్సులో డ్రైవర్ గుండెపోటుకి గురయ్యాడు. దీంతో బస్సు పక్కకు ఆపి సీటులోనే డ్రైవర్ నాగరాజు (38) కుప్పకూలిపోయాడు. అయితే అటెండర్ ఆటోలో డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గొల్లపూడికి చెందిన డ్రైవర్ నాగరాజు విజయవాడ డిపోలో పని చేస్తున్నాడు. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో బస్సులో ప్రయాణికులను అధికారులు వారి గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు.
-
Home
-
Menu
