మియాపూర్‌లో బోల్తాపడిన మినీ బస్సు

X
సంగారెడ్డి: ప్రైవేటు ఉద్యోగులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తాపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి సమీపంలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన పది మంది ఉద్యోగులను మినీ బస్సు తీసుకెళ్తోంది. మియాపూర్ ఆర్‌టిసి డిపో సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఉద్యోగులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
