వైద్యులకంటే రోబోలు బాగా ఆపరేషన్లు చేస్తాయా?

వైద్యులకంటే రోబోలు బాగా ఆపరేషన్లు చేస్తాయా?
X

కోట్లు ఖర్చుపెట్టి మెడికల్ విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం వేస్ట్.. మరో మూడు సంవత్సరాలలో రోబోలు వైద్యుల కంటే బాగా ఆపరేషన్లు చేస్తాయని ఎలాన్ మస్క్ అంటున్నాడు. ఒకటి కొత్తది కనిపెట్టగానే అప్పటికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. సెల్ ఫోన్ రాగానే ల్యాండ్ లైన్ ఫోన్లు కాలగర్భంలో కలిసిపోయినట్లు, కానీ ఆ సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు, అమ్మే షాపులు రీఛార్జ్ సెంటర్లు ఈ విధంగా ఎంతోమందికి అది ఉపాధిని కలిగించింది. అలాగే ఈ కొత్త రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన కానీ అది ఇంకా ఎంతోమంది వైద్యుల కు ఉపాధిని కల్పిస్తుంది. రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి వైద్యులకు సహాయ కారి అవుతాయే కాని వైద్యులకు ప్రత్యామ్నాయం కాజాలవు.


ఇప్పటికే కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీలో అయినా ఎండోస్కోపీలు, లాప్రోస్కోపిలు, రోబోటిక్ సర్జరీలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, డయాగ్నొస్టిక్ పరికరాలు అన్నీ కూడా వైద్యులకు ప్రత్యామ్నాయం కాలేదని, అవి వైద్యులకు సహాయకారిగా ఉంటూ వైద్యులకు ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు క్లినికల్ నాలెడ్జ్ తో పరీక్ష చేసి నిర్ధారణ చేసే చిన్నపాటి జ్వరాలకు కూడా ఇప్పుడు ఎన్నో డయాగ్నొస్టిక్ టెస్టులు చేసి వేలు ఖర్చుపెట్టి జబ్బు నిర్ధారణ చేసిన విధంగా ఉంటుంది. వాళ్ల టెక్నాలజీని అమ్ముకోవడానికి ఈ విధంగా డబ్బా కొడుతూనే ఉంటారు. కానీ వైద్యుడిని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. అది వైద్యుని సహాయం తీసుకుని వైద్యునికి ఉపయోగకరంగా ఉంటూ డెవలప్ కావాల్సిందే.

మీరేమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Next Story