249 కిలోల గంజాయిని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు

X
విజయవాడ కానూరు వద్ద 249 కిలోల గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్‌తో కలిసి చేసిన ఆపరేషన్‌లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి యూపికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా నుంచి ఎపికి వాహనంలో నిందితులు గంజాయిని విజయవాడకు తరలించారు. కానూరులో నిల్వ చేసి.. యుపి వాహనంలో ఎక్కిస్తుండగా.. డిఆర్‌ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక నిందితుడు సహా ఐదుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.49.76 లక్షలు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు.
Next Story
-
Home
-
Menu
