మహబూబ్ నగర్ లో.. లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి

X
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన కారు యజమాని ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు నాలుగేళ్ల కుమారుడు హైవేపై ఆగి ఉన్న లారీ వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
