చెట్టును కారు ఢీకొనడంతో పలువురికి గాయాలు

చెట్టును కారు ఢీకొనడంతో పలువురికి గాయాలు
X

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మెట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను నిజామాబాద్, కరీంనగర్ ఆసుప్రతులకు తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags

Next Story