రోడ్డు ప్రమాదం..చెట్టును కారు ఢీ: ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం..చెట్టును కారు ఢీ: ముగ్గురు మృతి
X

హైదరాబాద్: భద్రాద్రి జిల్లా లో ములకలపల్లి మండలం పూసుగూడెం- మాదారం అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్టును కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ములకలపల్లి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు భద్రాచలం వాసులుగా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story