ఔటర్ రింగ్ రోడ్ పై డిసిఎంను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

ఔటర్ రింగ్ రోడ్ పై  డిసిఎంను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి
X

రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఎస్ పిఎ సమీపంలో ముందుగా వెళ్తున్న డిసిఎంను కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రోడ్డుపై ప్రమాదం జరగడంతో ఔటర్ రింగ్ రోడ్ పై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.



Tags

Next Story