జాతీయ రహదారిపై కారు బోల్తా

Car overturns
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై కారు బోల్తా పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారును గద్వాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసి బస్సు కారును ఢీకొట్టి ఆగడంతో వెనకాల వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గద్వాల ఆర్టీసీ బస్సును ఢీకొంది.
ఆర్టీసీ బస్సును ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు 50 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
-
Home
-
Menu
