సూర్యాపేటలో డివైడర్ ను ఢీకొట్టిన కారు: ఒకరు సజీవదహనం

X
సూర్యాపేట: డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవదహనమైన సంఘటన సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివారులోని హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. కాసకుర్తి జగదీశ్ అనే వైద్యుడు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సేవలందిస్తున్నాడు. ఖమ్మం పట్టణానికి వెళ్తుండగా పిల్లలమర్రి శివారులో కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అతడు సజీవదహనమయ్యాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
Tags
Next Story
-
Home
-
Menu
