వరదలో చిక్కుకుపోయిన కారు.. కాపాడిన స్థానికులు

X
ఖమ్మం జిల్లా ఏనుకూలరు మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాచారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో ఒక కారు వరద నీటిలో చిక్కుకుపోయింది. నిర్మాణంలో ఉన్న వంతెన పక్కన తాత్కాలికంగా మట్టితో దారి ఏర్పాటు చేశారు. వరద ఉద్ధృతికి మట్టి కొట్టుకుపోవడంతో కారు నీటిలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అందులోని నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Next Story
-
Home
-
Menu
