ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాజ్

ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అత్యంత చిన్నవయసులో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆటగాడిగా నయా చరిత్ర సృష్టించాడు. అల్కరాజ్ 22 ఏళ్ల వయసులో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా అల్కరాజ్‌కు ఇది ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటికే వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. తొలిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 26, 62, 63,75తో సెర్బియా యోధుడు,
నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన నొవాక్ మరోసారి నిరాశే మిగిలింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో నొవాక్ ఆధిపత్యం చెలాయించాడు. అల్కరాజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి సెట్‌లలో అల్కరాజ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో నొవాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో రెండో, మూడో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ నాలుగో సెట్‌లో అల్కరాజ్‌కు నొవాక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు.
-
Home
-
Menu
