చరిత్ర సృష్టించాడు.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాస్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో నొవాక్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)పై ప్రపంచ నెంబర్ 1 అల్కరాస్ విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగి ఈ మ్యాచ్‌లో అల్కరాస్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అతడు చరిత్ర సృష్టించాడు.
22 ఏళ్ల అల్కరాస్‌కి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇది తొలి టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ ఓపెన్ (2024,2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిళ్లు సాధించాడు. మరోవైపు జకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఇది తొలి ఓటమి. ఇప్పటివరకూ ఫైనల్‌కు చేరిన పదిసార్లు అతడు విజేతగా నిలిచాడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక (25) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లుచల్లాడు. ప్రస్తుతం 24 టైటిళ్లతో ఉన్న జకోవిచ్ 25 టైటిల్ కోసం తెగ కష్టపడుతున్నాడు. చివరగా 2023లో యుఎస్ ఓపెన్ గెలిచాక.. అతడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ కొట్టలేకపోతున్నాడు.
-
Home
-
Menu
