ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు సీలింగ్ కూలి పలువురికి గాయాలు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా పైకప్పు సీలింగ్ కూలిపోవడంతో ముగ్గురు రోగులు, ఇద్దరు రోగుల సహాయకులు, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ప్రస్తుత భవన నిర్మాణం, మౌలిక వసతుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల.. ప్రస్తుత పాత ఆసుపత్రి భవనాలపై అధిక భారం పడుతోంది. దీంతో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నూతన ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
-
Home
-
Menu
