తెలంగాణకు హైస్పీడ్ రైళ్లు..

తెలంగాణకు హైస్పీడ్ రైళ్లు..
X

తెలంగాణకు 3 హైస్పీడ్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది. దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పుణె- హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయి. వీటితో పాటు ముంబయి-పుణె, ఢిల్లీ- వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై- బెంగళూరు మధ్య కూడా కొత్త కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రకటించారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని అన్నారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమాయాన్ని కుదిస్తాయని, రహదారి మార్గం, ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు.

Tags

Next Story