చాయ్ షాట్స్’ ప్రారంభం

తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్... దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ ఏంజెల్ ఇన్వెస్టర్లుగా రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి, నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు.
’చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ “చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక అడ్భుతమైన పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్‌ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ “’చాయ్ షాట్స్’ను ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం. త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ బిస్కెట్ అనురాగ్, సీటీవో కృష్ణ, రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, రాహుల్ హుమాయున్ పాల్గొన్నారు.
-
Home
-
Menu
