దొరల దౌర్జన్యంపై తిరుగుబాటు.. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ

X
హైదరాబాద్: దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యోధురాలికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రేవంత్ గుర్తుచేసుకున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
