చంద్రబాబునాయుడు కాపుల మీద రగిలిపోతున్నారు: ముద్రగడ

అమరావతి: టిడిపి పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని, గతంలో తన కుటుంబాన్ని ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబానికి టార్టెట్ చేశారని కాపునేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరంగా అవమానించడం సరికాదని ధ్వజమెత్తారు. గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి నేతలను అవమానించడం సరికాదని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ విధించాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
కాపు సామాజికవర్గం కోపంగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్‌పై ఉన్న ప్రేమతోనే మద్దతు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపుల మీద రగిలిపోతారని, కాపులకు రిజర్వేషన్లు బాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కాపులంతా చంద్రబాబుపై కోపంగా ఉన్నారని, దయచేసి కాపులను ఎపి నుంచి ఇతర రాష్ట్రాలకు కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయాలని సూచించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిన నివేదికలో తెలిసిందని, బాబు చెప్పింది అబద్దమని తేలిపోయిందన్నారు.
-
Home
-
Menu
