ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారు: చంద్రబాబు

అమరావతి: బిఎస్ఎన్ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్కసారి టెక్నాలజీ
మారిందంటే ఎవరూ ఆపలేరని అన్నారు. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని, బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయని తెలియజేశారు. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారని పేర్కొన్నారు. జాబ్ వర్క్ చేస్తున్నామని కొత్త ఆలోచనలు రావాలని, 2010 లో 4 జి, 2020 లో 5జి, 2023 లో 6జి సేవలు వస్తాయని చెప్పారు. నరేంద్ర మోడీ దూదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని, కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ అని
ప్రశంసించారు. ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారని, ప్రధాని సూచిస్తే డిజిటల్ కరెన్సీపై రిపోర్టు ఇచ్చామని అన్నారు.
మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని, అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయని, ఎవరూ
ఆపలేరని అన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని, మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో
వస్తుందని, సేఫ్టీ, సెక్యూటరీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటి చాలా
అవసరమని, దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తుంటే.. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ తీసుకొస్తున్నామని రియల్ టైమ్ డేటా కోసం ఐవోటీలు
వస్తున్నాయని, రియల్ టైమ్ లో మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నాం అని 2010 లో 4జి, 2020లో 5జి, 2030లో 6జి సేవలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
-
Home
-
Menu