కారు డోరు లాక్ కావడంతో.. ఊపిరాడక చిన్నారి మృతి

X
జూలూరుపాడు: కారులో ఊపిరాడక చిన్నారి మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వినోబానగర్ సర్పంచి గంగావత్ నవీన్‌కు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి వద్ద ఆడుకుంటూ కారు ఎక్కింది. అనంతరం డోర్ వేయడంతో లాక్ పడింది. కుటుంబసభ్యులు చిన్నారి కనిపించకపోవడంతో సమీపంలో గాలించారు. దాదాపు 2 గంటల తర్వాత కారులో చూడగా ముందు భాగంలోని రెండు సీట్ల మధ్యలో పడిపోయి ఉంది. కారు అద్దాలు పగలగొట్టి బాలికను బయటకు తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story
-
Home
-
Menu
