కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై కళ్లలో కారం పొడి చల్లి.... రూ.1 కోటి బంగారం ఎత్తుకెళ్లారు

కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై కళ్లలో కారం పొడి చల్లి.... రూ.1 కోటి బంగారం ఎత్తుకెళ్లారు
X

కూకట్‌పల్లి: బైక్‌పై వెళ్తుండగా కళ్లలో కారం పొడి చల్లి కోటి రూపాయల విలువల గల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బహదూర్‌పూరాకు చెందిన ఎండి ఖస్రూ, ఎండి ఖైసర్ అనే వ్యక్తులు బంగారం బ్యాగ్‌తో ఎపి 12 విజి 1207 అనే నంబర్ గల స్కూటీపై రాత్రి పది గంటల సమయంలో వెళ్తున్నారు. కూకట్‌పల్లిలో మెట్రో పిల్లర్ 837 వదకు రాగానే ఖస్రూ, ఖైసర్ కళ్లలో గుర్తు తెలియని నలుగులు వ్యక్తులు కారం పొడి చల్లారు. అనంతం వాళ్ల చేతిలో ఉన్న గోల్డ్ బ్యాగ్‌ను లాక్కొని రెండు బైక్‌లపై పారిపోయారు. వెంటనే ఖస్రూ, ఖైసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బంగారం విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు.

Tags

Next Story