దలైలామాకు గ్రామీ అవార్డు.. తీవ్రంగా ఖండించిన చైనా

China
X

ప్రముఖ బౌధ మత గురువు దలైలామా గ్రామీ వార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పారు. అయితే దలైలామాకు ఈ అవార్డు రావడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఆయన గుర్తింపును ఉపయోగించుకొని.. చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.


ఈ వ్యవహారంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదని ఆరోపించారు. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని పేర్కొన్నారు. సంబంధిత పక్షాలు ఈ అవార్డును బీజింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సాధనంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story