చింతామణి తండా పంచాయతీ ఏకగ్రీవం

X
రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం, చింతామణి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుగులోత్ సింధుజ గంగాధర్‌లను గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాబోయే సర్పంచ్ గుగులోతు సింధుజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, రానున్న రోజుల్లో చింతామణి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని అన్నారు.
Next Story
-
Home
-
Menu
