హనుమజ్జయంతి రోజున అద్భుత సన్నివేశం.. చిరు డివోషనల్ పోస్ట్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా చిరు ఓ ప్రత్యేకమైన వీడియోని అందరితో పంచుకున్నారు. తన పూజా మందిరంలోని హనుమాన్ విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకిన అద్భుత సన్నివేశాన్ని ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రతి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ పూజా మందిరంలో ఉన్న హనుమంతుడి పైనుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరిస్తాయని అన్నారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశామన్న చిరు.. కోణార్క్, అరసవెల్లిలో సూర్య కిరణాలు ఆయన విగ్రహాన్నే తాకడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అనిభావోద్వేగానికి గురయ్యారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL
-
Home
-
Menu
