ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
X

చిత్తూరు: జిల్లాలోని నగరి మండలం తడుకుపేట వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతులు సంతానం, శంకర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Tags

Next Story