ఇద్దరు విద్యార్థుల గొంతు పిసికిన సిఐ

పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు.. బీటెక్ సెకండ్ ఇయర్‌కు వెళ్లకుండా ఉండటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు విద్యార్థులు ధర్నా చేశారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలని నినాదాలు చేశారు. దాదాపు గంటసేపు విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కలెక్టర్‌ను కలుస్తామని గేటు దాటి విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులందరినీ అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు బలవంతంగా నెట్టసాగారు. ఈ క్రమంలో సిఐ ఇద్దరు విద్యార్థుల గొంతులను నొక్కి పిసికారు. వారు విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి జీవోను రద్దు చేయాలని విద్యార్థులు కోరారు. విద్యార్థులకు మద్దతుగా డిఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనలో పాల్గొంది.
-
Home
-
Menu
