రెండో విడత పంచాయతీ ఎన్నికలు... అక్కడక్కడ ఘర్షణలు

హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించగా ఒక్క ఓటు తేడాతో బిఆర్ఎస్ గెలిచినట్లు అధికారుల ప్రకటించారు. మరోసారి రీ కౌంటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ నెలకొంది. మూడో వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి సునందన విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో గొడవలు జరిగాయి. పోలీసుల రంగ ప్రవేశంతో చేయడంతో వివాదం సద్దుమణిగింది.
-
Home
-
Menu
