రాజేంద్రనగర్లో ఏడో తరగతి విద్యార్థిని అదృశ్యం...... కిడ్నాప్ కలకలం!

స్కూల్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని బాలిక.. ఓ మహిళపై అనుమానాలు.. యువకుడి కోసం పోలీసుల గాలింపు
మన తెలంగాణ - సిటీ బ్యూరో: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలిక అదృశ్యం కలకలం రేపింది. స్కూల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన బాలిక సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మొదట చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికకు మాయమాటలు చెప్పి ఓ మహిళ యువకుడితో పంపించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలికను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బాలికను సురక్షితంగా గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Tags
-
Home
-
Menu
