స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్
X

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి స్పష్టంగా పేర్కొంది. ఇడి దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు గుర్తించింది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. 2024 అక్టోబర్‌లో రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో వైసిపి ప్రభుత్వ హయాంలో సిఐడి కూడా కేసులు పెట్టింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలు లో పెట్టింది.

కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను చూపించలేకపోయింది. తప్పుగా నమోదు చేసిన కేసుగా చివరికి గుర్తించి విజయవాడ లోని ఎసిబి కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల ్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు, జనవరి 13న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండూ తోసిపుచ్చడంతో ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తెరపడింది. అడ్వకేట్ జనరల్ (ఎజి) దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ దర్యా ప్తు తర్వాత చంద్రబాబుతోపాటు పలువురు నేతలకు స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్దారించిందని వెల్లడించారు.

Tags

Next Story