అప్రమత్తంగా ఉండండి

Cm Revanth Reddy Slams Kishan Reddy And KTR
మన తెలంగాణ/హైదరాబాద్‌ః మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ రెండు రోజులూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాల్సిన బాధ్యతను పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్న ఇంఛార్జి మంత్రులను, ఇతర ముఖ్య నేతలను ప్రచారం ఎలా జరుగుతున్నది ?, ప్రజల స్పందన ఎలా ఉంది ? అని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోల్ మేనేజ్‌మెంట్ గురించి దిశా నిర్ధేశం చేశారని తెలిసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని, మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
-
Home
-
Menu
