సౌమ్య మృతికి బాధ్యులపై కఠిన చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబు ల్ సౌమ్య మృతికి కారణమైనవారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీ సు శాఖను ఆదేశించారు. విధి నిర్వహణలో సౌ మ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. సౌమ్య మృతిపట్ల రేవంత్‌రెడ్డి ఆదివా రం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సౌమ్య కు టుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామ ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బా సిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రా ష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆమె సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఖురేషి, ఉప కమిషనర్లు జె.హరికిషన్, అంజన్ రావు, చంద్రయ్య, ప్రదీప్ రావు, కృష్ణ ప్రియ, డి.శ్రీనివాస్, నవీన్ కుమార్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, తెలంగాణ ప్రొహిబిషన్, ఆబ్కారీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి చంద్ర శేఖర్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, భరత్, ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం కృష్ణ, మధుబాబు, కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేష్‌తో పాటు సుమారుగా 500 మందికిపైగా ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మహేష్ కుమార్ గౌడ్
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతిచెందిన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు.
ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద సౌమ్యకు నివాళి
ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు ఆదివారం నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
-
Home
-
Menu
