బిఆర్‌ఎస్, బిజెపి మధ్య క్విడ్ ప్రోకో

CM Revanth Reddy to go to Jharkhand on Feb 5
X

CM Revanth Reddy to go to Jharkhand on Feb 5

పరస్పరం సహకరించుకుంటున్న ఇరు పార్టీలు

కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగిస్తే కేంద్రం ఏం చేసింది?

ఇ-కార్ రేస్‌లో విచారణకు అనుమతి కోరితే ఇంతవరకూ అతీగతీ లేదు

పెద్దనోట్లను రద్దు చేస్తే అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీని అభినందించింది బిఆర్‌ఎస్ కాదా?

కేంద్రంలోని బిజెపి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా?

మోడీ ప్రేమ ఉంటే చాలని కెసిఆర్ బహిరంగంగా ప్రకటించలేదా?

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్‌రావును

20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లనే అరెస్టులో జాప్యం

బిఆర్‌ఎస్‌ను యాసిడ్‌తో కడగాలి

రాష్ట్రంలో మళ్లీ మొలకెత్తకుండా చూడాలి

మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్‌ఎ స్, బిజెపి మధ్య క్విడ్ ప్రోకో బంధం బలపడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. “మీ క ళ్ళ ముందు ఉన్న కేంద్రంలోని పన్నెండేళ్ళ బిజెపి పాలన, గత పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన, మా రెండే ళ్ళ పాలనను చూసి ఆలోచించి ఓట్లు వేయం.. మ మ్మల్ని ఆశీర్వదించండి” అని రేవంత్‌రెడ్డి పట్టణ ఓటర్లకు పిలుపునిచ్చారు. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో రా ష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన తెలిపారు. పన్నెండేళ్ళుగా కేంద్రం లో మోడీ ప్రధానిగా ఉండి మన రాష్ట్రానికి చేసిందేమిటో చెప్పాలని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. 2014లో మాలమూరు సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాగా ప్రకటిస్తామని ప్రధాని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తే జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని తాను ఆశించానని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తే ఆ జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందించే ప్రాణహిత-చేవెళ్ళ పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని అనుకున్నానని, అయితే ఫడ్నవీస్ ప్రజలను అవమానించి, ఓట్లు వేయాలని కోరారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు నష్టపోయిన వారికి కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం చేస్తే, మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆమోదం చెప్పారని ఆయన తెలిపారు. ఇది నిజమేనని ప్రజలు విశ్వసించి యాభై డివిజన్లలో బిజెపి కార్పొరేటర్లను గెలిపించారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ మాటే ఎత్తడం లేదని ఆయన దుయ్యబట్టారు.

సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి

సత్రంలో ఉచిత భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. వాహనాలు ఇప్పిస్తామన్నారు కదా? అని ప్రజలు ప్రశ్నిస్తే, మీకు వాహనాల ఇన్సూరెన్స్ ఉంది కదా, క్లెయిమ్ చేసుకోండి అని సంజయ్ చెప్పడం ప్రజలను అవమానించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడేమో మున్సిపాలిటీల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని బిజెపి నాయకులు అంటున్నారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రచారంలో లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటానే ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఉదాహరణకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే, నలభై రెండు పైసలే తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటకకు పదహారు పైసలు, తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారని, కేరళకు నలభై తొమ్మిది పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ రూపాయి చెల్లిస్తే, తిరిగి ఆరు రూపాయల ఆరు పైసలు చెల్లిస్తున్నదని, మధ్య ప్రదేశ్‌లో రూపాయికి కేంద్రం రెండు రూపాయల తొమ్మిది పైసలు చెల్లిస్తున్నదని, ఉత్తర్ ప్రదేశ్‌కి రెండు రూపాయల తొంబై పైసులు చెల్లిస్తున్నదని ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రులు ప్రశ్నించరా?

ఈ వివక్షపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీనిగాని, నీతి ఆయోగ్‌ను ఏనాడైనా అడిగారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం భావ్యమా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా ఆటోమోడ్‌లో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు వస్తున్నాయే తప్ప కేంద్ర మంత్రులు చేసిందేమిటీ? అని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తెచ్చారా? అని ఆయన నిలదీశారు.

మూసీకి నిధులు తెచ్చారా?

మూసీ నదికి అదనంగా నిధులు తెచ్చారా? సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తెచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన ఐటఐఆర్, సెమీ కండక్టర్ ప్రాజెక్టులు రాకుండా చేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కనీసం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకైనా నిధులు తెచ్చుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం వరదల౮ సమయంలోనూ అదనంగా నిధులు తేలేదని ఆయన విమర్శించారు. వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణకు తామే నిధులు కేటాయించామన్నారు.

మోడీకి ఎన్నికలకు ఏమిటీ సంబంధం?

పైగా ప్రధాని నరేంద్ర మోడీని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ్ల బిజెపిని గెలిపించాలని కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు ఓటర్లను కోరుతున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీకి, ఎన్నికలకు ఏమిటీ సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ వచ్చి మోరీ తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. గల్లీ ఎన్నికలకు మోడీకి ఏమిటీ సంబంధం అని అన్నారు. ఓట్లు వేయించుకోవడం, సీట్లు గెలుపొందడం తప్ప రాష్ట్రానికి అదనంగా ఏమి చేశారో బిజెపి నాయకులు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మత రాజకీయాలు ఎంత కాలం?

మత రాజకీయాలు ఎంత కాలం చేస్తారని ఆయన బిజెపి నేతలను ప్రశ్నించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని భూతంలా చూపించి ఓట్లు దండకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వారి భావదారిత్య్రానికి నిదర్శనమని విమర్శించారు.

బిఆర్‌ఎస్ ఏ ముఖం పెట్టుకుని..

రాష్ట్రంలో పదేళ్ళూ అధికారంలో ఉండి ఇప్పుడు సమస్యల పరిష్కారానికి తమకు ఓట్లు వేయాలని బిఆర్‌ఎస్ నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకూ అన్ని పదవుల్లో బిఆర్‌ఎస్సే ఉండి ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అహంకారం, విద్వేష ప్రసంగాలతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారని, దోపిడికి పాల్పడిన వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఉన్మాదంతో, మానసిక రోగంతో ఫోన్ ట్యాపింగ్‌తో వందల కోట్లు వసూలు చేశారని ఆయన విమర్శించారు.

ముసుగు తొడుక్కోకుండా..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ముఖానికి ముసుగు తొడుక్కుని వెళ్ళకుండా బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్ళినట్లు చేతులు ఊపుకుంటూ, సైగలు చేసుకుంటూ వెళుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. బిజెపి-బిఆర్‌ఎస్‌లది విడదీయలేని బంధం కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. గతంలో నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టలు, త్రిపుల్ తలాక్‌కు బిఆర్‌ఎస్ మద్దతునిచ్చిందని ఆయన దుయ్యబట్టారు. మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని ప్రధాని మోడీని కెసిఆర్ బహిరంగంగా అన్నారని ఆయన తెలిపారు. ఈ అనుబంధాన్ని రాష్ట్రంలో నిధులు తెచ్చేందుకు ఉపయోగించి ఉంటే బాగుండేదన్నారు.

బిఆర్‌ఎస్ మొక్కను మొలవనీయవద్దు..

అందుకే ఇప్పుడు కెసిఆర్, కెటిఆర్, టి. హరీష్ రావు అరెస్టు కాకుండా బిజెపి కాపాడుతున్నదని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ మొక్కను మొలవనీయవద్దని ఆయన ప్రజలను కోరారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా మొదటి తేదీనే ఇస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణ మాఫీకి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తనదేనని ముఖ్యమంత్రి అన్నారు.

Tags

Next Story