మామ అలుళ్లు.. దక్షిణ తెలంగాణ రైతుల జీవితాలపై మరణశాసం రాశారు.. సిఎం రేవంత్ ఫైర్

సిద్దిపేట: మాజీ సిఎం కెసిఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. దక్షిణ తెలంగాణ రైతుల జీవితాలపై మరణశాసనం రాసి సంతకం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. 2015లో చంద్రబాబు, కేసీఆర్, హరీష్‌రావు కలిసి కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వలేదా.? అని ప్రశ్నించారు. "మామ, అలుళ్లు పెట్టిన సంతకాల కాపీలు, ఫైల్స్ ఉన్నాయి. అసెంబ్లీకి రా మాట్లాడదాం.. నువ్వేం చేశావో.. నేనే చేశానో చెప్తా. వైఎస్ జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి రాయలసీమ కట్టుకోమని చెప్పింది వాస్తవం కాదా?. రోజమ్మ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పలేదా? అంటూ" సిఎం రేవంత్ మండిపడ్డారు.
"చెప్పింది చెప్పినట్టు.. 2023, డిసెంబర్ 7న ప్రజాపాలన ప్రమాణస్వీకారం చేసింది. 2029లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం. నాలుగు దశాబ్దాలుగా మామ, మామ పోతే అల్లుడు, బామ్మార్ది వస్తారట. ఎవడెవడో సిద్దిపేట గడ్డను ఏలడానికి ఇది అనాధల రాజ్యమా?. సిద్దిపేటలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తా. ఎమ్మెల్యేగా గెలిచే నేత పేరు నాకు ఇవ్వండి.. టికెట్ వచ్చేలా చూస్తా. టికెట్ ఇచ్చే బాధ్యత నాది.. గెలిపించుకునే బాధ్యత ప్రజలది. ఈరోజు నుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారు. ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేశాం.1983లో సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మదన్‌మోహన్ నిరూపించారు. మదన్ మోహన్ పేరును చరిత్ర నుంచి కనుమరుగు చేయాలని కేసీఆర్, హరీష్‌రావు చేయని కుట్ర లేదు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్‌మోహన్ పేరు పెట్టాలని ఆదేశిస్తున్నా. ఆనాడు సింగిల్ విండో ఎన్నికల్లో మొదటిసారి కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే మదన్‌మోహన్. సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ లేకుండా చేయాలని హరీష్‌రావు కుట్ర చేశారు. కేసీఆర్ కాస్కో గజ్వేల్ గడ్డపై కాలు పెడతా.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తా అని ఆనాడే మేడ్చల్‌లో చెప్పా" అని సిఎం అన్నారు.
-
Home
-
Menu
