దేశమంతటా కేరళ పవనాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కేరళం రాజకీయ గాలి యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుందని సి ఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేరళం రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆ యన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్ సారథ్యంలోని బిజెపి భారతాన్ని మతం పేరిట వి భజిస్తోందని, గాంధీ పరివార్ మాత్రం భారత ఐక్యతకు కృషి చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పా రు. భారత ఆత్మ (ఐడియా ఆఫ్ ఇండియా)కు రా హుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారని ఆయ న అభిప్రాయ పడ్డారు. వాతావరణ నిపుణులు రు తుపవనాల కోసం కేరళం వైపు ఎలా చూస్తారో దే శ రాజకీయాలను అర్థం చేసుకునే విషయంలోనూ కేరళను ఒక సంకేతంగా చూడవచ్చని ఆయన అ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేరళంలో ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ -2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ లభించింది. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆ పురస్కారాన్ని రేవంత్‌రెడ్డి స్వీకరించా రు. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సిఎం రేవంత్‌రెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
కేరళం దిగ్గజ కాంగ్రెస్ నేత, మా జీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, సిఎం రేవంత్ రెడ్డి దూర దృష్టితో కూడిన నాయకత్వాన్ని గుర్తిస్తూ రేవంత్ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువల పట్ల రేవంత్‌రెడ్డి చూపుతున్న నిబద్ధతను ఈ అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించినట్లు వెల్లడించారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, కేరళలోని నాలుగు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆర్యదాన్ ముహమ్మద్ ప్రజాసేవ, లౌకిక విలువలు, సామాన్యుల సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా కేరళలో గుర్తింపు పొందారు. ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో కెసి వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1991లో కేరళలో కరుణాకరన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పివి నరసింహా రావు ప్రధానమంత్రి అయ్యారని, 1996లో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. 2001లో ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రి కాగా, 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. 2026లో కేరళలో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించడంతో కొత్త రాజకీయ గాలి మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు. కేరళ నుంచి మొదలైన ఈ గాలి దేశమంతా తుఫానుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్యదాన్ ముహమ్మద్ తన జీవితాంతం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఆర్యదాన్ ముహమ్మద్‌కు నిజమైన నివాళి అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును పరిరక్షించాలి
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటు హక్కును కాపాడాలని దేశంలో ఓట్ల దొంగతనం, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దొంగతనం, నిధుల దొంగతనం జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపించారు. యువత భవిష్యత్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నదే నా లక్ష్యమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అధికారాన్ని, పదవులను త్యజించారని ఆయన చెప్పారు. ఇప్పుడు చరిత్ర పిలుస్తోందని, రాహుల్‌గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం
ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేరళ నుంచి పార్లమెంట్‌కు ఎన్నిక కావడం తనకు ఈ రాష్ట్రంతో మరింత అనుబంధాన్ని కల్పించిందన్నారు. తనకు వ్యక్తిగత రాజకీయ ఆశలు లేవని, 2006లో క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. గత రెండు దశాబ్దాల్లో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపి, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వంటి వివిధ పదవులను చూశానని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇక నా ముందున్న ఏకైక లక్ష్యం రాహుల్‌గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడటం అని స్పష్టం చేశారు. కేరళలో మొదలైన రాజకీయ మార్పు గాలిని దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మార్పు గాలులు వీస్తున్నాయని, రాహుల్ గాంధీ ఆశాభావ సందేశం ప్రజల్లోకి వెళ్తోందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడే వరకు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
కేరళకు రావడం నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది
ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు ఆయన సేవలందించారని ఆయన కేరళ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. నీలాంబూర్‌తో పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బలమైన శక్తిగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం మరింత ప్రత్యేకమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోని బృందంలో ఒక కార్యకర్తగా తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నానని ఆయన చెప్పారు. కేరళకు రావడం తనకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలోనూ, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇక్కడకు వచ్చిన విషయాన్ని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రతిసారి కేరళ ప్రజలు తనకు ఆత్మీయ స్వాగతం పలికారని సిఎం చెప్పారు. లౌకికవాదానికి అండగా నిలుస్తూ కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్న కేరళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-
Home
-
Menu
