కెసిఆర్‌ హయాంలోనే ఎపి నీళ్ల దోపిడి.. SLBC, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎందుకు పూర్తి చేయలేదు.?

కెసిఆర్‌ హయాంలోనే ఎపి నీళ్ల దోపిడి..  SLBC, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎందుకు పూర్తి చేయలేదు.?
X

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హయాంలోనే ఎపి జలదోపిడి చేసిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడి ఆపే శక్తిలేకపోతే.. తెలంగాణ వచ్చాక ఎందుకు అడ్డుకోలేదు? అని, నదిని మళ్లించుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని సిఎం బిఆర్ఎస్ పై ఫైరయ్యారు.ఈ మేరకు సిఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరంలో బిఆర్‌ఎస్‌ 119టిఎంసిలే వాడుకుందని, 2024-25లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 285టిఎంసిల నీటిని వాడుకుందని తెలిపారు.

"ఎపి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే, మీరేం చేశారు?.ఎస్ఎల్ బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎందుకు పూర్తి చేయలేదు?. డిండి, అచ్చంపేట, కోయిల్‌సాగర్‌ లాంటివి పదేళ్లు వృథాగా ఉన్నాయి. రూ.2.20లక్షల కోట్ల బిల్లులు ఇచ్చారు.. కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. కృష్ణా జిల్లాలో 578టిఎంసిల నీళ్లు తెలంగాణకు రావాలి. ఒప్పందంలో ప్రతి ఏడాది మాట్లాడుకునే వెసులుబాటు ఉండేది. కానీ 2020లో ఒకేసారి ఏపీకి 512టిఎంసిల నీళ్లను కెసిఆర్ తాకట్టు పెట్టారు. బీఆర్‌ఎస్‌ అబద్ధాలనే నమ్ముకుంది. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఏపీకి నీళ్లు దోచి పెడుతున్నారని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే.. జగన్‌ పల్నాడు వాటర్‌ గ్రిడ్‌కు జీవో ఇచ్చారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే ఈ జీవో వచ్చింది" అని సిఎం రేవంత్ చెప్పారు.

Tags

Next Story