డిటిఒ వెంకన్న మృతి పట్ల సిఎం దిగ్బ్రాంతి

X
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న డిటిఒ ఎం. వెంకన్న మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరకాల-భూపాలపల్లి హైవేపై డిటిఒ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులపైకి బొగ్గు టిప్పర్ దూసుకరావడంతో డిటిఒ వెంకన్న మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story
-
Home
-
Menu
